Posts

Showing posts from April, 2009

కుస్తీ....

జీవితం కాస్త జబ్బుపడినట్టుంది, మనస్సు కాస్త మబ్బుపడినట్టుంది, ఉదయించిన వేకువతో లేవని బద్ధకం, మదించిన మధ్యాహ్నంతో భుజం కలపని ఆయాసం, వాలిన సాయంత్రాన్ని సాగనంపాలని లేని నిరుత్సాహం, రాలిన చీకటి తెరలను తడుముకుంటూ ఆవులింత..... ఊహల్ని మాత్రమే పరిపాలిస్తున్న ఉత్సాహం ఒకపక్క, వాస్తవ వాకిట్లో చేరి మతిని పోషించకుంది...... ఒటమిలో పడి దేవులాడుతున్న దినాంకము మాటున, గెలుపు తన పరిచయమే దాచి, ఉనికి కోల్పోయినట్టుంది.... అలవాటైపోయిన అసహాయత, కలపాటైపోయిన ఆశలవాయిదా, వెలుగుతో రుణం తీరిపోయిన్నట్టుంది...... శ్వాస క్రియే సమరమైపోయినట్టుంది...... - శ్రీవాహిని

నా"నోలు" ....

1) డబ్బు, దేవుడు, మనిషి, కుక్క..... 2) తెల్ల గుడ్డల, రాజకీయ లొల్లి, దేశం వొంటిమీద, మచ్చల బొల్లి.... 3) నేల ప్రమిద, గాలి నూనె, మనసు మొలకెత్తితే, అది దీపం.... 4) కొడవలి, వంగింది, కాళ్ళని చూస్తుందా.... పదునే పోయిందా....

నా 'నోలు'....

1) మాత్ర, యాత్ర, కూత, కోత... 2) వయాగ్రా మాత్ర, స్వర్గానికి యాత్ర, వేకువ కోడి కూత, నీ సంతోషానికి కోత....

నా 'నోలు'....

పాల పాకెట్టులు, హీరోయిన్ జాకెట్టులు, పని ఇక్కట్టులు, సెలవ్ కై పాట్లు.... ఎంత రాసిన, సిరా ఆరదు, నీలి రంగు, సాగరం..... పదం, కదం, అయోమయం జగన్నాధం... డాక్టర్ మందు బిళ్ళ, నీ చేతికి చిప్ప, ఎరా రాంపండు, ఇది ఏం ధర్మం....

నా 'నోలు'....

1) పాకెట్టులు, జాకెట్టులు, ఇక్కట్టులు, లవ్ పాట్లు.... -శ్రీవాహిని 2) రాసిన, సిరా, రంగు, గరం..... -శ్రీవాహిని 3) పదం, కదం, జగన్నాధ, రథం.... -శ్రీవాహిని 4) బిళ్ళ, చిప్ప, పండు, ఇది ఏం ధర్మం.... -శ్రీవాహిని

ఆవేశం.......

ఆవేశం, ఆక్రోశం, ఆలాపన సిరా నాది..... అనుభవించి, అనువదించి, అనుకరించు జగం నాది...... పదం నాది, కదం నాది, జగన్నాధ రధం నాది..... - శ్రీవాహిని

ఆవకాయ.కాం

ప్రసిద్ద తెలుగు వెబ్ పత్రిక ఆవకాయ.కాం లో నా కింది కవిత ఏది సత్యం.... ఏదసత్యం.... ప్రచురితమైంది....

ఆవకాయ.కాం

ప్రసిద్ద తెలుగు వెబ్ పత్రిక ఆవకాయ.కాం లో నా కింది కవిత "నాలోని నాదాలు" ప్రచురితమైంది....

నాలోని నాదాలు....

నా స్వేఛ్ఛకు నేనే సీమని, కాని స్వ"రాజ్యంలో నా పాలన లేదు.... నా వాంఛ్ఛకు నేనే కాపుని, కాని ఆ"కంక్షల హత్యలు నావి.... నేను, నా గది, నలో, గదిలో, చీకటి... చీకట్లో గది, గదిలో నేను, గదికి తలుపులు ఉన్నాయి, కాని బయటకి రానివ్వనిది, వెలుగంటే భయమా, సంశయమా, అలవాటులో ఉన్న సౌకర్యమా, మర్పుతో మనిషికున్న జన్మ వైరమా... నేను అంటూ, నాతనాన్ని ఆశ్వాదించడం మానేసి, నలో నేను చరించడం మానేసి, ఎన్నళ్ళైందో గుర్తుకురాట్లేదు, నన్ను గెలుచుకున్న, మలుచుకున్న, దాఖలాలు కనబడట్లేదు... కళ్ళు నలుపుకుని నిద్ర లేస్తున్న ప్రతీ ఉదయం, ఇరుకు సందుల్లోంచి మయూఖ హస్తం చాచింది, అది స్వార్ధ స్నేహమా, ఎదురొచ్చిన అద్దమా, అరుణించిన అసహాయతా... అదేంటో, ఈమధ్య వొంటిమీద చర్మం కూడ, కిరాయి బుస్కొట్టులా అనిపిస్తోంది..... తనువులో అత్మ అద్దెకుంటున్నట్టుంది.... ఒక్కో శ్వాసని తాకట్టుకుపెట్టి, ఒక్కో ఆనందాన్ని అప్పుకు తెచ్చుకుంటున్న నేను తెలివైన వాడినా, అవివేకినా.... మేధ, మనసుకి మధ్య రణం, తప్పొప్పుల నైతిక రుణం, మంచీ చేడుల విచక్షణ మరో ఆవ"రణం, గొంతుక విరగ చించుకుంటున్నా, ఆ ఘొష పెదవి గుమ్మం దాటకుంది, వినేవళ్ళు కరువనా, వివరించడం చేతకాకనా.... ల

కవితావేశం....

నిజాల జాడలు, కిరాయి వాడలు, విలాస తత్వం త్రిశంకు స్వర్గం, నిసర్గ, విసర్గ, కులాస వర్గం, మనిషని తెలిసే, తెలిపే ఉనికి, శ్వసలు కదిలి చేర్చే మజిలి, మనిషి, మమత, మనసు కల్తీ, గాలి, నేల నీరు, కల్తీ, మరో ప్రపంచం వెరే లేదే, జననం మరణం కవనం ఇక్కడే, జ్వలిచివేసే అనలావేశం..... అమరం, అమృతం కవితావేశం....

ఏది సత్యం - ఏదసత్యం....

అవును నిజం, కాదు నిజం, పలవరింత పలుకు నిజం, ధ్యాస ఆశ, రుజువు భాష, తీరు తీరు రుణం నిజం.... తీపి నిజం, చేదు నిజం, పలకరింత పలుకు నిజం, తలపు పరుగు, తపన కుదురు, గతి స్థితి ఉనికి నిజం.... పగలు నిజం, రేయి నిజం, కరిగిపోవు కలా నిజం, క్షణం తోడు, మరుపు కూడు, తరం తరం గమన నిజం.... నిన్న నిజం, రేపు నిజం, సమన్వయించు నేడు నిజం, ఊహ రచన, మేధ మదన, కలం కులం రణం నిజం....

"గురుతు"వులు

నన్నల్లుకున్న నవ్వులెన్నో, నా వాకిలి తడిపిన జల్లులెన్నో, గుత్తు గుత్తుల గుర్తులు, గుబురులేసుకున్న ఙాపకాలెన్నో, ఆనందనంతో కమ్ముకున్న పరవశం.... ఆ"నందంలో తడిసిన మనసుకి పడిసం....

నవ్వు ......

ఎంచక్కా కిలకిలమన్నది, పెదవంతా కితకితలన్నది, మరిచావో, పడిపోయిందో, దచారో, దొచేశారో, కష్టాల చూపుకి బెదిరి, చికట్లో దాక్కొని ఉందో....

అంతర్మధన....2

మౌనం, మనస్సు మలిచే మధుర మరీచిక, ఆలోచన, రగిలిన మేధకి రోజుకో భూమిక, మనిద్దరి చూపుల మధ్య, నాలుగు లోకాలున్నాయి, నా కళ్ళతో చూసే నీ లోకం, నా కళ్ళతో చూసే నా లోకం, నీ కళ్ళతో చూసే నీ లోకం, నీ కళ్ళతో చూసే నా లోకం, ఒక్క చిత్రానికి, చిత్రవర్ణానికి, నాలుగు అర్ధాలున్నాయి... మడిచి చూస్తే, ఒకటి, మలిచి చూస్తే, ఇంకొకటి, ఎదురెదురుగా ఉన్న అద్దాల్లో, కోటి ప్రతిబింబాలున్నట్టు, తిప్పి చూస్తే, తరచి చూస్తే, మరి కొన్ని కధలున్నాయి... ఏది నిజమో, ఏది భ్రమో, అసలెదో, కొసరేదో, తేల్చుకోలేని పరిస్థితి ప్రతీ క్షణం పలకరిస్తూ ఉంటుంది.... నిశ్శబ్ధమే నిట్టూర్పు విడిచేంత నిర్లిప్తత అనవరతం వెంటాడుతూ ఉంటుంది... తప్పొప్పుల తర్జుమాలో, యధావిధిలో, హడవడిలో, జీవిత సారం పలచబడిపోతూ ఉంది....

ఆరోహనావలోకనం - II

లభించడం, లాభించడం, ప్రస్థావనకందని భావన, ప్రస్తుతానికి మించిన ఆలోచన, తనువు వెన్ను చూపకపోయినా, మాటిమాటికి మననం చెసుకుంటున్న మనస్సు మాత్రం అలవాటు మానట్లేదు, గుర్తులను, తరచి తరచి, తెరచి చుసుకొవడం ఆపట్లేదు. అడుగు, కదం, పరుగు …. గతి స్రుతి తప్పని పయనం… నిన్న, నేడు, రేపు, ఆంతా నిండున్నది ఉనికి రుజువులే… ఫ్రాసకి వత్తసు పలికెతెనే ప్రతీ పదం కవితగ మారేది, ఫ్రయాసకి గొంతు కలిపితేనే ప్రతీ ఉత్సాహం హాయిగ మారేది, అతీతం అదిరోహిస్తెనె కద గెలుపు వరించేది, వసంతం రుచి చుస్తెనె కదా బ్రతుకు విలువెరిగేది…..

ఆరోహనావలోకనం...

నీడ ఒక కౌగిలింతకు నోచుకోవాలంటే, తనువు వెలుగుక్కి వెన్ను చుపాలి... వెను తిరగని కదనం కావాలంటే, పాదం ముందరి బాటకు సాగాలీ, నీడ తలపుతెరల వెనక్కి ఒగ్గాలి... నిన్నలో వదిలొచ్హామా? కాలం తోలుకొచిందా? ఎటూ తేలకుండా ఉన్న అలోచనలు..... చూడబోతే లొకం వాటుద గడిచిన కాలం, ఇంకోపక్క...మర"పు"టల్లో.... ఆ కాలం దాచుకున్న అధ్యాయాలు... గడచిన క్షణాల గుర్తులుగా, వలయం అల్లిన ఙ్యాపకాలుగా, గతించిన నిన్నకి రుజువులుగా, నెటి హాయిగా, రెపటి ఉట్సాహంగా... అన్వయించడానికి, అనువదించడానికీ,అందక నిన్నటి నీడ, నీడలా మిగిలిపోదనీ... తిసే ప్రతి పరుగులో, వేసే పరతీ మొదటి అడుగులో, ఎదురునిలుస్తుందని, తిరిగివస్తుంది వస్తుందనే ఆశ....

హృది వసంతం...

ఒక విల్లు ఒల్లువిరిచినట్టు, ఒక బాణం పరుగుతీసినట్టు, ప్రతీ కదలిక, అదౄశ్య పాశ బంధనికి నిదర్షణమౌతూంది, మబ్బులో తేమను చుస్తే, సంద్రపు వాకిలిని వదిలొచ్చి దారితప్పినట్టుంది, ఒక దూది అల్లుకుని దారమైనట్టు, ఒక సూది ఝల్లుమని నాట్యమాడినట్టు, ప్రతీ ప్రతిస్పందన ఒక కొత్త కధకి ఒఋఅవడి ఔతుంది, కుంచెలో రంగులు చుస్తే, తెరకెక్కని బొమ్మల్ని కరిగించి దాచుంచినట్టుంది ప్రకృతి స్పర్షైతే... మనసు ప్రతిస్పందనౌతుంది..... ౠతుగమనం చమత్కారమైతే, ఆ రుచి ఇంకాస్త ఆస్చర్యమేస్తుంది, జనించిన ప్రతీ ఊహ ఒక నవవసంతమౌతుంది, ధ్వనించిన ప్రతీ సంబరం ఒక యుగాది ఔతుంది... - శ్రీవాహిని