Posts

Showing posts from October, 2008

నా మధన.....

నా కవిత నా బధ్యత, కవిని కనుక.... నా ఉనికి నాకు మేలుకొలుపు, మనిషిని కనుక.... నా ప్రశ్న నా మంత్రం, తాపసిని కనుక.... లోపలంతా ఏదో కోపం లోకమంతా ఏదో లోపం, పలచబడని పలకరించని, చిక్కని చిక్కుబడని, నెత్తురింకా పరుగుతీస్తూనే ఉంది, అది చలోక్తి చలనం..... పాపాన్ని బయటకి, పుణ్యాన్ని లొనికి బదిలీ చేసే, ప్రతీ స్వేదరంద్రమొక వైకుంఠ ద్వారం..... ప్రమేయం లేని ప్రతీ అలోచన, అద్భుతమే, అస్వాదిస్తేనే అసలు కధ చెడేది... తిక్కదే, వెక్కిరించతగ్గదే, ఒక్క పల్లవే కాదు, నిక్కచ్చిగా వొలిచి చుస్తే, చరణంలో కూడా నిజయితీ లేదు, ఎంత వెతికినా విలువ పన్నెండణాలే తేలుతుంది, పదహరని ఎవరైన తప్పు చెప్పరో, లేక మిగతా నలుగెవరైన దోచుకెల్లరో, లెక్క కుదురు నిండు కాదు, లేదని, తెలిసిన ఒప్పుబడని, మతి - మతం, సమస్తం సతమతం........ మంచి-చెడు, తప్పు - ఒప్పు, వెలుగు-చీకటి, అర్ధం-స్వార్ధం, ఇలా నిజం నైజం వెతుక్కుంటూ, ఒక పక్క, అనుసరించలేక, అనుకరించలేక, మరొక పక్క, నా మేధ, నా మధన.....

అక్షర

తలంపుకొచ్చి మనస్సుదొచే, అద్దమంటి ఆ లక్షణమేది..... వరించబొతే తరింపచేసే, అందమైన నా అక్షరమేది...... - శ్రీవాహిని

అంతర్మథన

అడుగులో అలొచనలో, తలపులో తడబాటులో, కాలం కలం, రచించిన కలకలం, మంజూరే, తొలంచక తప్పదుగా...... నేస్తమై తోడున్న నీడకి, ఉనికిని గుర్తుంచిన ఊపిరికీ, మనసుని గౌరవించిన ప్రతీ భావానికి జోహారు..... మన్నించకపోతే తప్పుగదా..... - శ్రీవాహిని