Posts

Showing posts from September, 2007

నిష్పత్తి

మది కధనం చతురమే, మరుపుల మతి మధురమే, కలిసిపాడే గానం, యుగళవర్ణమే, కదిలి రాసే కవనం, నిత్యాగమనమే, ఉదయించిన తూర్పు లేఖలో ప్రశంసల ప్రేమ రేఖలు, అస్తమించిన పడమటి బాహువుల్లో, తలదాచుకున్న గాయాల సమూహాలు, మూసుకున్న కళ్ళకి ప్రతీపదం'లో'పం, తెరిచి చూస్తే కళాఖండం, ఆగి ఒక శ్వాష, రేగి ఒక నిట్టూర్పూ, పంటికో రుచి, కంటికో లోకం, కాలాన్వయ భావం, భావాన్విత ఉద్వేగం, జీవితం, స్వేచ్చకు పరాకాష్టైనాకానీ సీమలకు పరిమితమే, షడృతువుల ప్ర'బంధమైనా కవనం, వసంతకాల వాసమే..... సుఖాలకి ప్రాసలా కష్టాలెన్నిఉన్నా పయనం నిరంతరం విలాసమే..... - శ్రీవాహిని

రుణం

లిఖించబడని కావ్యంలా, వర్ణించతగని భావంలా ఉంది... మధురంగా ఉంది, మధు తరంగంలా ఉంది.... నిశితంగా ఉంది, విషయం విధి పాషంలా ఉంది.... - శ్రీవాహిని

సొగసు

కోపమొచ్చే కోయిలమ్మకి, కొమ్మజాతి గుమ్మకి.... తాపమొచ్చే వన్నె విల్లుకి, చెల్లు కాని చెలువకి.... -శ్రీవాహిని

మౌ(ని)ద్ర....

చెప్పాలని ఉంది, కదలికలేని చలనానిగురించి.... ఉదాహరణకి కూడా చిక్కుబడని వింత వివరణలని.... చీకటి పేరిట కళ్ళ వాకిళ్ళపై దండెత్తి వచ్చి రచించిన దారుణకాండను, చెప్పలనే ఉంది కానీ, ఎలా చెప్పనూ.... చరించిన కలల 'జ'గతిని ఎలా వర్ణించనూ.... యోగ ముద్ర వెలిసేలోగా మౌన నిద్ర సడలిపోతుందీ.... మనసుకి ఊహ స్పర్శ తెలిసే లోగా, రేయి పగలై పగిలిపోతుంది.... కలలు కలలని తెలుసుకునే లోగా తెలివి తలుపు తడుతూ ఉంటుంది..... - శ్రీవాహిని

అస్తిత్వం

పరుగులు తీసే కాలానికి మడుగులొత్తుకుంటూ, నిజాన్ని అబద్దానితో పోల్చుకుంటూ, అన్వయించుకుంటూ పోతే జీవితం ఆ'విరి 'గా మారిపోతుంది అనుభవించేంత అదృష్టానికి నోచుకోకుండా ఇగిరి పోతుంది... సూన్యమై మిగిలి పోతుంది... ఎదో సాధించాలనే తాపత్రయంలో మరొక తనువుకి నీడగా మారిపోతే, ప్రాణమున్నా మనసు వెలుగులేని దీపమైపోతుంది, దారితీసేంత, కాసేంత కడ చూసే ఓపికలేని తీరమైపోతుంది.... అసలును మడిచి చూస్తే...అనుకరణ కొసరును మలిచి చూస్తే....అన్వయం - శ్రీవాహిని