మౌ(ని)ద్ర....

చెప్పాలని ఉంది,
కదలికలేని చలనానిగురించి....

ఉదాహరణకి కూడా
చిక్కుబడని వింత వివరణలని....

చీకటి పేరిట కళ్ళ వాకిళ్ళపై
దండెత్తి వచ్చి రచించిన
దారుణకాండను,

చెప్పలనే ఉంది కానీ, ఎలా చెప్పనూ....
చరించిన కలల 'జ'గతిని ఎలా వర్ణించనూ....

యోగ ముద్ర వెలిసేలోగా
మౌన నిద్ర సడలిపోతుందీ....
మనసుకి ఊహ స్పర్శ తెలిసే లోగా,
రేయి పగలై పగిలిపోతుంది....
కలలు కలలని తెలుసుకునే లోగా
తెలివి తలుపు తడుతూ ఉంటుంది.....


- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...