Posts

Showing posts from June, 2007

శ్రీకవీయం.........

కడుపులోపెట్టి పెంచి పోషించుకున్న, కడుపే పొంగిపోయేలా పెరిగిపోతున్న, ఒక్క క్షణానికి ప్రాణమనిపిస్తున్న, మరొక్క నిమిషానికి కష్టమనిపిస్తున్న, పేగు పాషమే కాలం కాళ్ళని పాశాణం చేస్తున్న, భావి భావమే భారమైన బంగారమనిపిస్తున్న, తీపి చేదుల విచిత్ర రుచులనందిస్తున్న స్వర్గం.... ప్రేమ రంగులని నింపుకున్న చిత్రం..... కలలు కలిపి కలిసి రాసుకున్న, కవిత్వం..... శ్రీకవీయం

అలసిపోయానా ?

PASSION లేని పాశాణమైపొయిందో, MATERIALTISTIC మెట్లెక్కే తాపత్రయంలో పడింపోయిందో, కలలకున్న సహజ దృక్పథం కోల్పోయిందో, కణకణల కళా జ్వాల కాలం వొడిలో సేదతీరిందో, అలా ఉండాలి, ఇలా ఉండొద్దూ, అనే వైకల్పిత ప్రాకారాలకు తలనొగ్గిందో, గెలుపు ఓటముల వలయాలయంలో పరుగుల పంథాలలో సృజనాస్పృహ నీరసించి నిదురోయిందో, తెలీదు కాని.... అదేదో గ్రహణం ఆవహించిన్నట్టు.... నాలోని తేజం నిర్వీర్యమైపోయినట్టు.... ఉంది.... - శ్రీవాహిని