Posts

Showing posts from November, 2008

నా, కాలేని నీడ....

మొహమాటపు హాయిగ, మాయగ చేసిన, మూయగ చూసిన, మంత్రం తంత్రం, కాలానికి కొత్తా కాదూ, తనకి మన కధ మొదలూ కాదు, వర్ణాతీతమైన లోకాలు-జగాలు అన్వయించబడని, అనువదించబడని, అర్ధమున్నాకానీ, అనూభ్(అ)అవించడానికి, ఉనికున్నా పనికిరావు..... తొక్కే కదం అనిపించడానికి అనుకొవడానికి పరుగు లా ఉంటుంది కాని కాదు, ఉత్సాహం లేనిదెలాగో ఊహా జనించదు,రచించదు, చూడబోతే తీరలేక చెరో దిక్కు చేరుకున్న తలపు, తనువు, మనసు...... అన్నీ చేస్తుంది, అనుకున్నది తప్ప..... కాలం ఉన్న తోడు ఉందని తెలుసుకాని, వెన్నంటే ఉన్నా కౌగిలించుకోలేని నీడ తోడు ఏం లాభం......???? - శ్రీవాహిని

నిజం నైజం.....

చేదు కాని నిజం వుంది, నాది నీది అయిన జగం కూడా వుంది.... కాలం పంపిన రాయబారం, నిన్న రేపుల, నేటి సమన్వయం, తీపి చేదుల సమాహారం.... ఓ అమాయక చక్రవర్తీ ! చేదు కొసం చుస్తే తీపి కనబడుతుందా..? దృక్పథం వేరు అని ఊరుకుంటే, ఊహ సమసిపోతుందా..? మనసు నడిచిన బాటకి కాలి నడక తోడు, వెతికి చూసిన మనసుకి తలపు అర్ధమవ్వకాపోదు...

చేదు నిజం....

నిజం చేదు, కల్ల చేదు, ఆగి చుస్తె నిన్న చేదు, నడక కాళ్ళ వరస కాదు, మనసు కూడ నడవగలదు, నాది కాదు, నీది కాదు, అటు ఇటు ఎటు లేదు, మనం మనం, నిరంతరం ఆలొచనలకే పాలుపోని తీరు, పథం కాదు దృక్పథమే వేరు.. - శ్రీవాహిని

దమన....

ప్రమేయం లేని ప్రతీ ఆలొచన అద్భుతమనీ, వర్ణాతీతమనీ అస్వాదిస్తేనే తెలిసేది... అనుభవిస్తేనే అర్ధమయ్యేది.. మన లెక్క పన్నెండణాలే తేలితే అది చెప్పిన వారి తప్పు కాదు... పదహారణల విలువ, తూలికగా కూర్చితే మన లెక్క కుదురు ఒప్పుకాదని తెలియకాపోదూ... లొపలున్న కొపానికి, అనుసరించలేని, అనుకరించలేని, అన్వయించుకొలేని, మన తాహతుకు, లోకాన్ని నిందిస్తే....ఎలా ?!!! సతమతమైన మనలోని సమస్తానికీ, చెసుకొలేని తీరికకీ, రచించుకొలేని మన ఊహకీ, కాలాన్ని దూషిస్తే....ఎలా ?!!!