Posts

Showing posts from February, 2008

ప్రేమకధ....

అలా విహారానికెళ్ళాను, అదేదో కాళ్ళపడింది, వదిలించుకుపోదామనుకున్నాను,అది అదృష్టమని, ముడులు వేయించుకునే బంధమౌతుందనీ తెలీదుకనుక......... అలిసిన మనసుకు సేద తీర్చవచ్చిన పసి పవనంలా తోచింది, పసిడి ప్రాణంలా వెలిసింది, చేజారితే ఆ క్షణానికే ఉనికి ఉండదనిపించి, చేయికై చెయ్యి చాచాను, బాటలు వేసుకున్నాక, బాసలు చేసుకున్నాక, వెనక్కి తిరిగి చూసుకునే వీలుండదని తెలిసినా, కాలం మోసుకెల్తున్న పల్లకి, తానిచ్చిన కానుకేమో అని....