Posts

Showing posts from November, 2007

ప్రేమ........

నీలో నాకు నచ్చిందేముంది? నా ఇష్టం మెచ్చిందేమయ్యుంటుంది? మనసా, మాటా, ఆత్మీయతా, భరొసానా, తరిగిపోయే అందాలా? పెరిగిపోయే తనువు కొలమానాలా? రొజురొజుకీ అల్లుకుపోతూ ఉన్న, గుణ గణాలకు లోటులేని పదహారణాల పచ్చని రుణమాలలా?................... ఆలో'చించాల్సిందే ! కధకి మొదలు ఏముంది? విధి రాసే తుద ఏమివ్వబోతుంది ? అనుకుని, మాట్లాడుకుని, కుదుర్చుకుని, కలుపుంటేనే కదా... మొదలుకి ముందేముండేది....అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ,ఎందుకు, అని తెలిసేదీ... విధికి తలవంచాలనీ, కాలంతో పరిగెత్తి అలసిపోవాలనీ, తుద సంగతి తెలుసుకోవాలనీ లేదు,ఎందుకంటే, ఈ మధ్య గమ్యం కంటె నీతో నడిచి గడిచిన పయనం మీద పడింది మనసు....