Posts

Showing posts from May, 2007

తొలిప్రాణం...

Image
అంగుళమే, అది ఆది పిండమే, మలుచుకుంటూ, అమర్చుకుంటూ, ఊపిరి పోసుకోవడం నెర్చుకుంటూ, ఊహల్లో ఊహ రచియిస్తూ, హత్తుకుంటూ, హక్కునంటూ, నవమాసాల మా'నవ భావం, కడుపు కష్టాలకి కడ సారం, పరుగులెట్టిస్తూ, పేగులల్లేస్తూ, పెరుగుతున్న తొలి ప్రాణం.... మా శ్రీకవీయం....

బహుమతి

కార్మికుల దినమునే, అందెను శ్రామిక ఫలసారం, ప్రకటించని ఆహ్వానానికి బదులుగా, పిలుపిచ్చిన ప్రాకృతిక ఆగమనం, వివరణకందని స్పందన, వివరము తెలుపని భావన, ఆదుర్దా, ఆతురం, ఖంగారుపాటు, కలవరం, ఆరాటం, ఆనందం, కొంతో కాస్తంతో,ఎంతో తెలీదుకాని, కొత్త రుచులు చూపించిన, తాపత్రయాల తహజీం....