నిష్పత్తి

మది కధనం చతురమే,
మరుపుల మతి మధురమే,
కలిసిపాడే గానం, యుగళవర్ణమే,
కదిలి రాసే కవనం, నిత్యాగమనమే,
ఉదయించిన తూర్పు లేఖలో
ప్రశంసల ప్రేమ రేఖలు,
అస్తమించిన పడమటి బాహువుల్లో,
తలదాచుకున్న గాయాల సమూహాలు,
మూసుకున్న కళ్ళకి ప్రతీపదం'లో'పం,
తెరిచి చూస్తే కళాఖండం,
ఆగి ఒక శ్వాష,
రేగి ఒక నిట్టూర్పూ,
పంటికో రుచి, కంటికో లోకం,
కాలాన్వయ భావం,
భావాన్విత ఉద్వేగం,
జీవితం,

స్వేచ్చకు పరాకాష్టైనాకానీ
సీమలకు పరిమితమే,
షడృతువుల ప్ర'బంధమైనా కవనం,
వసంతకాల వాసమే.....
సుఖాలకి ప్రాసలా కష్టాలెన్నిఉన్నా పయనం
నిరంతరం విలాసమే.....

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...