ఆరోహనావలోకనం...

నీడ ఒక కౌగిలింతకు నోచుకోవాలంటే,
తనువు వెలుగుక్కి వెన్ను చుపాలి...
వెను తిరగని కదనం కావాలంటే,
పాదం ముందరి బాటకు సాగాలీ,
నీడ తలపుతెరల వెనక్కి ఒగ్గాలి...
నిన్నలో వదిలొచ్హామా?
కాలం తోలుకొచిందా?
ఎటూ తేలకుండా ఉన్న అలోచనలు.....
చూడబోతే లొకం వాటుద గడిచిన కాలం,
ఇంకోపక్క...మర"పు"టల్లో....
ఆ కాలం దాచుకున్న అధ్యాయాలు...
గడచిన క్షణాల గుర్తులుగా,
వలయం అల్లిన ఙ్యాపకాలుగా,
గతించిన నిన్నకి రుజువులుగా,
నెటి హాయిగా, రెపటి ఉట్సాహంగా...
అన్వయించడానికి,
అనువదించడానికీ,అందక
నిన్నటి నీడ, నీడలా మిగిలిపోదనీ...
తిసే ప్రతి పరుగులో,
వేసే పరతీ మొదటి అడుగులో,
ఎదురునిలుస్తుందని,
తిరిగివస్తుంది వస్తుందనే ఆశ....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...