హృది వసంతం...

ఒక విల్లు ఒల్లువిరిచినట్టు,
ఒక బాణం పరుగుతీసినట్టు,
ప్రతీ కదలిక, అదౄశ్య
పాశ బంధనికి నిదర్షణమౌతూంది,
మబ్బులో తేమను చుస్తే,
సంద్రపు వాకిలిని వదిలొచ్చి
దారితప్పినట్టుంది,

ఒక దూది అల్లుకుని దారమైనట్టు,
ఒక సూది ఝల్లుమని నాట్యమాడినట్టు,
ప్రతీ ప్రతిస్పందన
ఒక కొత్త కధకి ఒఋఅవడి ఔతుంది,
కుంచెలో రంగులు చుస్తే,
తెరకెక్కని బొమ్మల్ని కరిగించి దాచుంచినట్టుంది

ప్రకృతి స్పర్షైతే...
మనసు ప్రతిస్పందనౌతుంది.....
ౠతుగమనం చమత్కారమైతే,
ఆ రుచి ఇంకాస్త ఆస్చర్యమేస్తుంది,
జనించిన ప్రతీ ఊహ
ఒక నవవసంతమౌతుంది,
ధ్వనించిన ప్రతీ సంబరం
ఒక యుగాది ఔతుంది...
- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...