నాలోని నాదాలు....

నా స్వేఛ్ఛకు నేనే సీమని,
కాని స్వ"రాజ్యంలో నా పాలన లేదు....
నా వాంఛ్ఛకు నేనే కాపుని,
కాని ఆ"కంక్షల హత్యలు నావి....

నేను, నా గది,
నలో, గదిలో, చీకటి...
చీకట్లో గది, గదిలో నేను,
గదికి తలుపులు ఉన్నాయి,
కాని బయటకి రానివ్వనిది,
వెలుగంటే భయమా, సంశయమా,
అలవాటులో ఉన్న సౌకర్యమా,
మర్పుతో మనిషికున్న జన్మ వైరమా...

నేను అంటూ,
నాతనాన్ని ఆశ్వాదించడం మానేసి,
నలో నేను చరించడం మానేసి,
ఎన్నళ్ళైందో గుర్తుకురాట్లేదు,
నన్ను గెలుచుకున్న, మలుచుకున్న,
దాఖలాలు కనబడట్లేదు...

కళ్ళు నలుపుకుని నిద్ర లేస్తున్న
ప్రతీ ఉదయం,
ఇరుకు సందుల్లోంచి మయూఖ హస్తం చాచింది,
అది స్వార్ధ స్నేహమా,
ఎదురొచ్చిన అద్దమా,
అరుణించిన అసహాయతా...

అదేంటో, ఈమధ్య వొంటిమీద చర్మం కూడ,
కిరాయి బుస్కొట్టులా అనిపిస్తోంది.....
తనువులో అత్మ అద్దెకుంటున్నట్టుంది....
ఒక్కో శ్వాసని తాకట్టుకుపెట్టి,
ఒక్కో ఆనందాన్ని అప్పుకు తెచ్చుకుంటున్న
నేను తెలివైన వాడినా, అవివేకినా....

మేధ, మనసుకి మధ్య రణం,
తప్పొప్పుల నైతిక రుణం,
మంచీ చేడుల విచక్షణ మరో ఆవ"రణం,
గొంతుక విరగ చించుకుంటున్నా,
ఆ ఘొష పెదవి గుమ్మం దాటకుంది,
వినేవళ్ళు కరువనా,
వివరించడం చేతకాకనా....

లోపం ఉంది
లోకాన్ని పంచుకున్న నాలోనా,
నన్ను ఉంచుకున్న లోకంలోనా,
అర్ధంకావట్లేదు......
రాజీల దినచర్య
అలవాటులా అయిపోయింది,
అలవాటు చేసిన "పొర"పాట్లెన్నో మరి !!...

స్వేచ్చకో సరికొత్త నిర్వచనం చెప్పాలని,
చీకటి నలుపుని చిలికి రంగుల్ని పుట్టించాలని,
హింసకో ప్రతిహింస మలుపు తేవాలని,
అనవరతం తపనపడుతూ ఉంది....
చిరునామా లేని టపాలా తిరుగుతూ ఉంది....
కై"పురి" విప్పి ఆడాలని అంది,
స్నిఘ్ధ,
సందిగ్ధ,
అనాధ మనసు.....

Comments

Padmarpita said…
బాగుంది.....
Ram said…
కవిత చాలా బాగుందండి...
నేను కూడా చిన్న చిన్న కవితలు రాస్తుంటాను, మిమ్మల్ని స్పూర్తి గా తీసుకుంటాను.
http://sites.google.com/site/radhikaramfamily/Home/ourhome/amma-ku-ankitham

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...