ఆశావాది...

ఆలోచిస్తేనే వచ్చే కష్టాలన్నీ,
ఆరాతీస్తేనే అంతరార్ధాల లోతు తెలిసేది,
చూపుకన్నా ఎక్కువగా కష్ట పడిపోతుందీమధ్య ఆలోచన,
అలుపన్న మాటనట్లేదసలు నిదురలోనైనా,
సూటిగా చూసి ఆలోచించాలో,
ఆలోచించి చుడాలో అర్ధంకాట్లేదు,
ప్రతీ ఉదయం,
నేను కళ్ళు విప్పుతున్నానా, లేక
పగలు తన చేత్తో నా కంటి కిటికీలు తెరుస్తుందా,
నేను నడుస్తున్నానా, లేక
కాలం తన వేగంతో పాటుగా
తూసుకుంటూ వెల్లిపోతొందా,
ఊహ సీమించబడినట్టూ,
స్వేచ్చ బంధించబడినట్టూ,
తనువు మట్టన్నట్టు,
కాలి బూడిదయ్యే సిగరట్టన్నట్టు,
ఆ పైవాడు ఏం తోచకపోతే,
పిచ్చి గీతలు, రాతలు రాసుకోడానికే
తయారు చేసుకున్న చిత్తు కాగితమన్నట్టు,
ఆలోచిస్తుంటే ఇలా
ఎన్నో ఉపమానాలు,
నా అసహాయ స్థితిని వర్ణించేందుకు....

అర చేతిలో ఉన్న నాణనికి,
ఒక పక్క అనుకూల
ఈంకో పక్క ప్రతికూలాచనలు,
సావకాశంగా తేల్చుకునే
సమయం లేదు,
నెగటివిటీ షుగ"రొచ్చి
వగరైపోయిన ఆలోచనలకి
ఆరారా పోజిటివిటీ అనే ఇన్సులిన్
ఇస్తే కాని ఇక బ్రతకడం కష్టమైపొయింది....

Comments

Unknown said…
nice article
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...