మార్పు...

ఒక పగలు ఒక సాయంత్రం...
తొడుగా నేను నడుస్తున్నాను...
పైన ఆకాశం...కింద నేల...
మూడొంతులు పైనే ఉన్నాను...
నడక వాలకం ఏడ్చినట్టే ఉంది....
ఎందుకంటే...
గమ్యమే లేదో...
దృష్టి గమ్యం పైన లేదో...
అన్నది అర్ధం కావట్లేదు...
పగలు ఊహల్లో, రాత్రి కలల్లో,
నివాసమైపోతుంది,
వాస్తవాన్ని
ధరించట్లేదు, భరించట్లేదు...
నన్ను నేను ఇష్టమంత ఇష్టపడుతున్నాను,
కాని నన్నెవ్వరూ నచ్చుకోవట్లేదు...
సోమరినట...
రావాల్సిన మార్పనేదేదో
నాకు నచ్చినట్టుకాకుండా,
పక్కవాళ్ళకి నచ్చినట్టే
ఎందుకు ఉండాలి ?

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...