మజిలీ...

నేను నేనంటూ
తాపత్రయపడే స్వార్ధం
మనిషిని నడిపిస్తూ ఉంటుంది..
అది కిందకి దిగి, వెంట జారుస్తుంది...

ఒక చోట అహంగా,
మరో చోట అన్యాయంగా,
ఒక వైపు అక్రమంగా,
ఇంకో వైపు అబద్దంగా,
బహు రూపి బాటసారిగా,
ఆడిస్తూ ఉంటుంది...
అనుసరిస్తే,
అనుభవిస్తుంది...

అదంతా,
కధంతా,
అది చేరే వరకే,
కడ చేర్చే వరకే...

మేను, నేను లేను అనే క్షణమే,
అర్ధాలకు ఉనికే ఉండదు...
వివరాలకి మజిలీలుండవు...

Comments

"naa", "nenu" aney swaartha bhaavam gurinchi arthavantam ga vivarincharu.. baagundi...

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...