గతి..

ఒకప్పుడు మా పై పోర్షనులోనే
అద్దెకుండేది వెలుగు...
నాకు మంచి పరిచయమే....
తొక్కలోది రెసెష్సన్ వేడి తట్టుకోలేక,
ఖాళీ చేసెళ్ళిపోయింది...
ఊరకుండక, కక్కుర్తికిపోయీ,
బ్రతుకు తెరువుకిపోయీ
చీకటికి చోటిచ్చాను...
అదేం చొరవొకాని...
కాస్తైనా ఖాళీని నాకంటూ ఉంచకుండా
పూర్తి కబ్జా చేసేసింది....
ఇవాల్టి అయోమయంలో నిలువనీడకు
మొహంవాచిన నా మొహం ఒక పక్క,
దిష్టి బొమ్మలా పరిస్తితులను
కాపలా కాస్తూ కుర్చున్న నా ఆషాజ్యోతి మరోపక్క,
సందిట్లో సడేమియా అన్నట్టు,
మాటమాటకి, మాటిమాటికీ
గతం సందులోకెళ్ళొస్తూ,
జేబులు సర్దుకొచేస్తున్నాయి,
నా ఆలోచనలు,
తెలియనివి ఏవీ లేవు,
మరిచిపోయి కొన్ని...
మడిచిపోయి కొన్ని...
వాటిట్లో, అన్నిట్లో, వాకిట్లో,
దాపరికాలెన్నో?
దారికాపలాలెన్నో...?

Comments

chaalaa bagundandi...

కాస్తైనా ఖాళీని నాకంటూ ఉంచకుండా
పూర్తి కబ్జా చేసేసింది....

మాటమాటకి, మాటిమాటికీ
గతం సందులోకెళ్ళొస్తూ,
జేబులు సర్దుకొచేస్తున్నాయి,

baagundi...

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...