నా, కాలేని నీడ....

మొహమాటపు హాయిగ,
మాయగ చేసిన, మూయగ చూసిన,
మంత్రం తంత్రం, కాలానికి కొత్తా కాదూ,
తనకి మన కధ మొదలూ కాదు,
వర్ణాతీతమైన లోకాలు-జగాలు
అన్వయించబడని,
అనువదించబడని,
అర్ధమున్నాకానీ, అనూభ్(అ)అవించడానికి,
ఉనికున్నా పనికిరావు.....
తొక్కే కదం అనిపించడానికి అనుకొవడానికి
పరుగు లా ఉంటుంది కాని కాదు,
ఉత్సాహం లేనిదెలాగో ఊహా జనించదు,రచించదు,
చూడబోతే తీరలేక చెరో దిక్కు చేరుకున్న
తలపు, తనువు, మనసు......
అన్నీ చేస్తుంది, అనుకున్నది తప్ప.....
కాలం ఉన్న తోడు ఉందని తెలుసుకాని,
వెన్నంటే ఉన్నా
కౌగిలించుకోలేని నీడ తోడు ఏం లాభం......????

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...