ప్రేమ........

నీలో నాకు నచ్చిందేముంది?
నా ఇష్టం మెచ్చిందేమయ్యుంటుంది?
మనసా, మాటా,
ఆత్మీయతా, భరొసానా,
తరిగిపోయే అందాలా?
పెరిగిపోయే తనువు కొలమానాలా?
రొజురొజుకీ అల్లుకుపోతూ ఉన్న,
గుణ గణాలకు లోటులేని
పదహారణాల పచ్చని రుణమాలలా?...................
ఆలో'చించాల్సిందే !

కధకి మొదలు ఏముంది?
విధి రాసే తుద ఏమివ్వబోతుంది ?
అనుకుని, మాట్లాడుకుని,
కుదుర్చుకుని, కలుపుంటేనే కదా...
మొదలుకి ముందేముండేది....అది
ఎప్పుడు, ఎలా, ఎక్కడ,ఎందుకు,
అని తెలిసేదీ...
విధికి తలవంచాలనీ,
కాలంతో పరిగెత్తి అలసిపోవాలనీ,
తుద సంగతి తెలుసుకోవాలనీ లేదు,ఎందుకంటే,
ఈ మధ్య గమ్యం కంటె
నీతో నడిచి గడిచిన పయనం మీద
పడింది మనసు....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...