నిత్యారోహణం........

ఇటుపక్క కులుకులతో కష్టం
వలయాకృతి రచిస్తూంటే,
ఒక్క క్షణం సమరమనిపిస్తుంది,
మరొక్క క్షణానికి, పయనమింతేనా అనిపిస్తుంది,
అటుపక్కనుంచి,నవ్వు దాటేసి,
చూపులు దాచుకుని
సంతోషం పిల్లి నడకలతో జారిపోతూంటే,
పదాలు పేర్చుకునే తన్మయత్వంలో,
ఊహలు ఉనికిని కోల్పొతుంటే,
అర్ధాలు వెతుక్కునే తాపత్రయంలో,
అనుభూతులు అదృశ్యమైపోతుంటే,
మయసభలో మలినపడుతున్న మనసులతో,
ప్రాభావాలతో పలచబడుతున్న పలకరింతలతో,
ముభావంగా ముడుచుకున్న
మమతలని చూస్తూ,
మూర్తీభవించిన అసహాయతలా
ఆశలు మారిపోతూంటే,
ముందుకేగాని, వెనుదిరగనంటూ,
సహజనిస్తూ, సహగమిస్తూ,
తపస్సులో నిమగ్నమైన మౌని మనస్సు....
తరిగిపోతే తిరిగి రాని నిధి వయస్సు.....
- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...