నేనే,...ఊహా విహంగం....


ఎగిరి చూస్తేగానీ తెలియలేదు,
ఎదిగిన పాదాలక్రింద,లొకం తరిస్తుందని;
చదివిచూస్తేగాని తెలియలేదు,
మలుచుకున్న గానమే చలన వేదాంతమని;
ఆక్రమిస్తే రెక్కలకందని గెలుపు లేదని,
ఆదరించిన ఆలాపనకి చలించని మనసు లేదని,
చాకచక్యం, చతురత,
దినచర్య చరణాలైతేగాని,
లోకం దృష్టి దాసొహమనదని....
తెలిసింది....,
చెపితే వినే చెవులు కరువని,
తెలిసింది....,
మళ్ళీ ఆస్వాదిద్దామని...,
లంఘించి....
రె"క్కల చప్పుడుతో....
విహంగమై....
విపంచినై....నేనే.....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...