అచంచల చలనం!

నటిస్తున్న ప్రతీ పదం,
బుకాయిస్తూ ప్రతీ శ్వాస,
నా తనాన్ని, అస్థిత్వాన్ని,
అబద్ధీకరిస్తున్న
నా లౌక్యం, అఙ్ఞ్యానతత్వం

ప్రొద్దుతోపాటుగా, కళ్ళు నలుపుకుంటూ
లేస్తున్న, ఆశలు,
గమ్యాన్ని జేబులో వేసుకుని
మోసుకెళ్తున్న, తాపత్రయాలు,
వాలిన సాయంత్రనికి మోకాళ్ళ మధ్య
తల వాలుస్తున్న, ఆలోచనలు,


అరచేతిలో బద్ధకం,
అరికాలికింద స్వర్గం,
సాధించింది లేదని కాదు,
ప్రగతి శూన్యమనీ కాదు,
మరీ గొంగళితో పోల్చలేం కాని,
ట్రెడ్మిల్లుపై పరుగులా ఉంది,
జీవితం...

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...