తపన....

కవిత్వం ఎండిపోయిందో,
సాగరం ఇంకిపోయిందో,
భావాలు నిండుకున్నాయో,
తృష్ణ తరించిపోయిందో,
రాయాలనున్నా పాళి తాకిడికి
కాగితం తడవట్లేదు,
రసవత్తరంగా కలం నరాలలో
ప్రవహించాల్సిన రక్తం పల్చపడింది,
సిరా అప్పుకావాలి,
మరోసారి నింపుకోవాలి,
అకాశం వైపుగా నోరు చాచి వేచి ఉన్నాను,
చినుకు చుక్క రాలుతుందేమోనని….
మేఘం రాల్చెళ్ళిన ఆ తడి లేఖ,
పెదవంచున స్వర్గంలా అవతరించింది…
- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నిష్పత్తి

అపర బ్రహ్మలా...