ఏది సత్యం - ఏదసత్యం....

అవును నిజం,
కాదు నిజం,
పలవరింత పలుకు నిజం,
ధ్యాస ఆశ,
రుజువు భాష,
తీరు తీరు రుణం నిజం....


తీపి నిజం,
చేదు నిజం,
పలకరింత పలుకు నిజం,
తలపు పరుగు,
తపన కుదురు,
గతి స్థితి ఉనికి నిజం....

పగలు నిజం,
రేయి నిజం,
కరిగిపోవు కలా నిజం,
క్షణం తోడు,
మరుపు కూడు,
తరం తరం గమన నిజం....

నిన్న నిజం,
రేపు నిజం,
సమన్వయించు నేడు నిజం,
ఊహ రచన,
మేధ మదన,
కలం కులం రణం నిజం....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...