కుస్తీ....

జీవితం కాస్త జబ్బుపడినట్టుంది,
మనస్సు కాస్త మబ్బుపడినట్టుంది,
ఉదయించిన వేకువతో లేవని బద్ధకం,
మదించిన మధ్యాహ్నంతో భుజం కలపని ఆయాసం,
వాలిన సాయంత్రాన్ని సాగనంపాలని లేని నిరుత్సాహం,
రాలిన చీకటి తెరలను తడుముకుంటూ ఆవులింత.....

ఊహల్ని మాత్రమే పరిపాలిస్తున్న ఉత్సాహం ఒకపక్క,
వాస్తవ వాకిట్లో చేరి మతిని పోషించకుంది......
ఒటమిలో పడి దేవులాడుతున్న దినాంకము మాటున,
గెలుపు తన పరిచయమే దాచి, ఉనికి కోల్పోయినట్టుంది....

అలవాటైపోయిన అసహాయత,
కలపాటైపోయిన ఆశలవాయిదా,
వెలుగుతో రుణం తీరిపోయిన్నట్టుంది......
శ్వాస క్రియే సమరమైపోయినట్టుంది......

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...