ప్రేమకధ....

అలా విహారానికెళ్ళాను,
అదేదో కాళ్ళపడింది,
వదిలించుకుపోదామనుకున్నాను,అది
అదృష్టమని, ముడులు వేయించుకునే
బంధమౌతుందనీ తెలీదుకనుక.........

అలిసిన మనసుకు సేద తీర్చవచ్చిన
పసి పవనంలా తోచింది,
పసిడి ప్రాణంలా వెలిసింది,
చేజారితే ఆ క్షణానికే
ఉనికి ఉండదనిపించి,
చేయికై చెయ్యి చాచాను,
బాటలు వేసుకున్నాక,
బాసలు చేసుకున్నాక,
వెనక్కి తిరిగి చూసుకునే వీలుండదని తెలిసినా,
కాలం మోసుకెల్తున్న పల్లకి,
తానిచ్చిన కానుకేమో అని....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...