సొగసు Get link Facebook X Pinterest Email Other Apps September 05, 2007 కోపమొచ్చే కోయిలమ్మకి,కొమ్మజాతి గుమ్మకి....తాపమొచ్చే వన్నె విల్లుకి,చెల్లు కాని చెలువకి.... -శ్రీవాహిని Get link Facebook X Pinterest Email Other Apps Comments
నా 'నోలు'.... April 22, 2009 1) పాకెట్టులు, జాకెట్టులు, ఇక్కట్టులు, లవ్ పాట్లు.... -శ్రీవాహిని 2) రాసిన, సిరా, రంగు, గరం..... -శ్రీవాహిని 3) పదం, కదం, జగన్నాధ, రథం.... -శ్రీవాహిని 4) బిళ్ళ, చిప్ప, పండు, ఇది ఏం ధర్మం.... -శ్రీవాహిని Read more
తపన.... April 14, 2011 కవిత్వం ఎండిపోయిందో, సాగరం ఇంకిపోయిందో, భావాలు నిండుకున్నాయో, తృష్ణ తరించిపోయిందో, రాయాలనున్నా పాళి తాకిడికి కాగితం తడవట్లేదు, రసవత్తరంగా కలం నరాలలో ప్రవహించాల్సిన రక్తం పల్చపడింది, సిరా అప్పుకావాలి, మరోసారి నింపుకోవాలి, అకాశం వైపుగా నోరు చాచి వేచి ఉన్నాను, చినుకు చుక్క రాలుతుందేమోనని…. మేఘం రాల్చెళ్ళిన ఆ తడి లేఖ, పెదవంచున స్వర్గంలా అవతరించింది… - శ్రీవాహిని Read more
అపర బ్రహ్మలా... April 14, 2011 రాయగలగాలే కానీ, ఉవ్వెత్తున ఎగిసిన ఆవేశానికి, ప్రతీ మనస్సూ కాగితమే, రాయాలి, శిలాక్షరాలను రాయాలి, రాస్తే మార్పుని రాయాలి, మార్పు తెచ్చే చైతన్యాన్ని రాయాలి, తుప్పుపడ్డ తేజాన్ని కడగాలి, కాలాన్నే కడిగెయ్యాలి.... కలాన్నై, కాగితాన్నై, కవిత్వాన్నై.... Read more
Comments