అస్తిత్వం

పరుగులు తీసే కాలానికి మడుగులొత్తుకుంటూ,
నిజాన్ని అబద్దానితో పోల్చుకుంటూ,
అన్వయించుకుంటూ పోతే
జీవితం ఆ'విరి 'గా మారిపోతుంది
అనుభవించేంత అదృష్టానికి నోచుకోకుండా
ఇగిరి పోతుంది... సూన్యమై మిగిలి పోతుంది...

ఎదో సాధించాలనే తాపత్రయంలో
మరొక తనువుకి నీడగా మారిపోతే,
ప్రాణమున్నా మనసు
వెలుగులేని దీపమైపోతుంది,
దారితీసేంత, కాసేంత
కడ చూసే ఓపికలేని తీరమైపోతుంది....

అసలును మడిచి చూస్తే...అనుకరణ
కొసరును మలిచి చూస్తే....అన్వయం

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...