ప్రీతి ప్రతి...

చెప్పాలి,
చేరాలి,
కదలాలి,
నిను కలవాలి...
అని పలికే నాలోని
భావ ప్రాణాలు....

అణువనువు ఆరాధిస్తూ,
అడుగడుగూ ఆరాతీస్తూ,
కదిలెళ్ళే పయనం నీకై,
చిరునవ్వుల గమ్యం నీవై,
చిగురాకుల పచ్చదనాన్ని,
చిగురాశల తెల్లదనాన్ని,
రంగరించి రంగుపంచిన,
అనురాగపు ఆమని రాగం నీది....

నాతో మొదలై నీతో ముగిసిన
ప్రతీ జన్మ సరికొత్త కారణం.....

నాలో ఎగసి నీలో సమసిన
ప్రతీ శ్వాస ఆత్మీయ రుణం....

Comments

చాలా బాగుంది ... కవిత... కవిత కోసమా!

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...