తృష్ణ గీతి.......

ఎన్నో ప్రశ్నలు, ఎన్నో తృష్ణలు,
హారతి పళ్ళెపుటంచులలో,
తలుపుల గొళ్ళెపుటిరుసులలో,
చెక్కల తొక్కల
దిక్కులులలో ఋక్కులలో.....

ఎన్నో తృష్ణలు, ఎన్నో ప్రశ్నలు,
వృష్టికి ఇచ్చిన అశ్రువులో,
విచ్చిమోసిన గొంతుకలో,
ఆరని గుండెల మంటలలో,
గణ గణ గణ గణ గంటలలో.....

లోకంలో, శోకంతో,
చలించి, జ్వలించె,
రణరంగాలు, గణరంగాలు,
ముస్తాబయ్యే శ్రీరంగాలా
కుదురే అరుదు,
భావం, భాగ్యం,
ప్రాణం, ప్రణవం,
సమాధానాల జాడలు లేవు,
నాలుగువైపుల సమిధల చితులే;
కదం తొక్కుతూ, పదం పాడుతూ,
అమాయకంగా, అయోమయంలో,
వెతుకులాటలో, బ్రతుకు పాటలో,
తోపులాటలో, పరుగు బాటలో,
నలిగే, చితికే ప్రతీ మనస్సులో,
తీరని ఆకలి, నెత్తుటి లోగిలి,
ప్రత్యక్షరం, ప్రతీ క్షణం,
ఆహ్వానాలు, ఆరోహణలు,
కాలం మెచ్చే మార్పులకోసం,
మార్పులు తెచ్చే రోజులకోసం,
ప్రశ్నల తృష్ణలు,
మరో ప్రపంచపు, మహా ప్రపంచపు,
ప్రస్తావనలు, ప్రస్థానాలు.......

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...