అలసిపోయానా ?

PASSION లేని పాశాణమైపొయిందో,
MATERIALTISTIC మెట్లెక్కే తాపత్రయంలో
పడింపోయిందో,
కలలకున్న సహజ దృక్పథం
కోల్పోయిందో,
కణకణల కళా జ్వాల కాలం
వొడిలో సేదతీరిందో,
అలా ఉండాలి, ఇలా ఉండొద్దూ,
అనే వైకల్పిత ప్రాకారాలకు
తలనొగ్గిందో,
గెలుపు ఓటముల వలయాలయంలో
పరుగుల పంథాలలో సృజనాస్పృహ
నీరసించి నిదురోయిందో,
తెలీదు కాని....
అదేదో గ్రహణం ఆవహించిన్నట్టు....
నాలోని తేజం నిర్వీర్యమైపోయినట్టు....
ఉంది....
- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...